Samantha: విజయ్ దేవరకొండ సినిమాలో సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

by Dishanational2 |
Samantha: విజయ్ దేవరకొండ సినిమాలో సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : మజిలీ ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవర కొండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక, ఇంక టైటిల్ పెట్టని ఈ సినిమా మణిరత్నం సూపర్‌హిట్ చిత్రం "రోజా" రీ-టెల్లింగ్, ప్రేమకథగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో మరో టాక్ నడుస్తోంది. విజయదేవరకొండ సినిమాలో నటించేందుకు సమంత రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోందని సమాచారం. ఇక వీరి కాబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహానటిలో వీరి మధ్య కెమిస్ట్రీకి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో ఎంతో మంది వీరిద్దరు కలిసి సినిమా చేయాలని కోరుకున్నారు. అందువలన వీరి కాంబినేషన్‌లో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, అందుకే సామ్‌కు 3 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించాలని మేకర్స్ భావిస్తున్నట్లో తెలుస్తోంది. కాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed