- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు హాట్ గురూ

X
దిశ, కుత్బుల్లాపూర్: సినిమా ప్రేమికులకు టికెట్ల రూపంలో దోచుకుంటున్నారు. ఒకవైపు భానుడు భగభగకు ప్రజలు అల్లాడిపోతుండగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా సినిమా చూడకుండా ఉన్నారు. కరోనా పూర్తిగా అంతరించి పోవడం తో సినిమా ప్రదర్శనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే భారీ సినిమాల పేరుతో సినిమా ప్రేమికులను దోచుకుంటున్నారని, ఇలా అయితే కష్టమే అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇందుకు ఉదాహరణగా ఈనెల 25వ తేదీన విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు జనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి రూ.200 ల టికెట్టును రెండింతలకు పైగా అంటే రూ. 410లు చేసి విక్రయించడం ప్రారంభించారు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందా..? లేక మరేమైనా కారణాలున్నాయా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
- Tags
- RRR movie
Next Story