RRRకు బిగ్ షాక్.. విడుదలైన కాసేపటికే ఆ వెబ్ సైట్స్‌లో ప్రత్యక్షం..

by Disha Web Desk 19 |
RRRకు బిగ్ షాక్.. విడుదలైన కాసేపటికే ఆ వెబ్ సైట్స్‌లో ప్రత్యక్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత కళాఖండం ఆర్ఆర్ఆర్. ఎంతో మంది అభిమానులు ఎదురుచూసిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ప్రముఖ నటులు ఎన్టీఆర్, రాంచరణ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో.. రికార్డ్ కలెక్షన్లతో ఈ చిత్రం దూసుకుపోతుంది. ఇలాంటి తరుణంలో.. ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రముఖ పైరసీ వెబ్ సైట్స్ మూవీరూల్స్, తమిళరాకర్స్‌లలో పైరసీ కాపీ ప్రత్యక్షమైంది. దీనితో రాంచరణ్, ఎన్టీఆర్ అభిమానులు పైరసీ చిత్రాన్ని ఎవరు ప్రోత్సహించవద్దని కోరుతున్నారు. ఇదిలా ఉంటే 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పైరసీకి గురి కావడంపై చిత్రయూనిట్ ఇంకా స్పందించలేదు. మరీ ఈ విషయంపై జక్కన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Next Story

Most Viewed