ఆ దేశంలో RRR మానియా.. అదరగొడుతున్న ఫ్యాన్స్..

by Dishafeatures2 |
ఆ దేశంలో RRR మానియా.. అదరగొడుతున్న ఫ్యాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: 'ఆర్ఆర్ఆర్' ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరనే చెప్పుకోవచ్చు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేసింది. ఈ మూవీ దెబ్బకు విదేశాల బాక్సాఫీసులు షేక్ అయిపోయాయి. ప్రస్తుతం అనేక దేశాల్లో 'ఆర్ఆర్ఆర్' హవా నడుస్తోంది. నెట్టింట సైతం ఈ మూవీ మానియానే హాట్ టాపిక్. ఇక నేపాల్‌లో అయితే 'ఆర్ఆర్ఆర్' ఫీవర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. థియేటర్లలో అభిమానులు తమ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు.

దేశంలో ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' నామస్మరణే వినిపిస్తోంది. ఈ సినిమా దెబ్బకు నేపాల్ బాక్సాఫీస్ బద్దలవుతోంది. ప్రతి రోజు కోట్లలో కలెక్షన్లు చేస్తోంది. థియేటర్లలో అభిమానులు తమదైన జోష్‌లో డాన్స్‌లు, కేరింతలతో ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపుఊపేస్తున్నాయి. 'ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' క్రేజ్ నేపాల్‌లో కొనసాగుతూనే ఉంది' అంటూ ఫ్యాన్స్ ట్వీట్‌లు చేస్తున్నారు.

Next Story