- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ న్యూస్.. వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ అవుట్
మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనున్న క్రమంలో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఉహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనున్న క్రమంలో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఉహించని షాక్ తగిలింది. నిన్న సాయంత్రం ప్రాక్టీస్ సెషన్ లో బంతి తగలడంతో తీవ్ర గాయం అయిందని వార్తలు వచ్చాయి. దీంతో అతను మొదటి వన్డే మ్యాచ్ ఆడలేడని ఫిజియో సిబ్బంది తెలిపారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. ఎవరూ ఊహించని విధంగా రిపోర్టులు వచ్చాయి. దీంతో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. శనివారం మధ్యాహ్నం వడోదరాలోని బీసీఏ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న పంత్.. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పొత్తికడుపు కుడిభాగంలో (Abdominal area) తీవ్రమైన నొప్పికి గురయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన బీసీసీఐ వైద్య బృందం పంత్‌కు ఎంఆర్‌ఐ (MRI) స్కానింగ్ నిర్వహించింది. నివేదికలను పరిశీలించిన అనంతరం పంత్‌కు 'సైడ్ స్ట్రెయిన్' (Oblique Muscle Tear) అయినట్లు నిర్ధారించారు. దీంతో అతను కోలుకోవడానికి సమయం పట్టనుండటంతో సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Wicketkeeper Dhruv Jurel)ను ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. జురెల్ ఇప్పటికే జట్టుతో కలిసినట్లు సమాచారం.
భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).






