కాంగ్రెస్ వినూత్న నిరసన.. డప్పులు కొట్టండి.. గంటలు మోగించండి

by Satheesh |

న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది.- LATEST TELUGU NEWS

కాంగ్రెస్ వినూత్న నిరసన.. డప్పులు కొట్టండి.. గంటలు మోగించండి
X

న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. గురువారం దేశవ్యాప్తంగా 11గంటలకు ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్లు, డ్రమ్ బెల్స్ మోగించాలని కోరారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'మార్చి 31న ఉదయం 11గంటలకు ప్రజలు ఇళ్లు, తమ తమ ప్రాంతాల నుంచి బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్లు, డ్రమ్ బెల్స్ మోగించండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకత తెలియజేస్తూ, చెవిటి బీజేపీ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించండి' అని తెలిపారు. కాగా కరోనా లాక్ డౌన్ సమయంలో బీజేపీ ప్రజలకు ఇచ్చిన పిలుపునే తిరిగి కాంగ్రెస్ నిరసనకు ఉపయోగిస్తుండడం గమనార్హం. కాగా గత ఐదు రోజుల్లో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రూ.3.20 పెంచింది. ఇంధన ధరలపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, దేశవ్యాప్తంగా మూడు దశలలో నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ఆందోళనలు చేపట్టనుంది.

Next Story