- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం అమెరికా కంపెనీతో కలిసి రిలయన్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటు!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం అమెరికాకు చెందిన సన్మినా కార్పొరేషన్‌తో కలిసి దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఎస్‌బీవీఎల్) కొత్తగా ఏర్పాటు చేయబోయే జాయింట్ వెంచర్‌లో 50.1 శాతం వాటా కోసం రూ. 1,670 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. మిగిలిన వాటాను సన్మినా కంపెనీ కలిగి ఉంటుంది.
ఈ జేవీ ద్వారా మేక్ ఇన్ ఇండియాను సాకారం చేస్తూ భారత్‌ను ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా రూపొందించనున్నట్టు కంపెనీ తెలిపింది. తయారీ కార్యకలాపాలు చెన్నైలోని ఫ్యాక్టరీలో జరుగుతాయని, అనంతరం దేశవ్యాప్తంగా యూనిట్లను విస్తరించేలా ప్రణాళిక కలిగి ఉన్నట్టు రిలయన్స్ పేర్కొంది. ఈ ఫ్యాక్టరీలో ఇరు కంపెనీలు కలిసి హార్డ్‌వేర్ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్‌ను తయారు చేయనున్నట్టు ఇరు సంస్థలు పేర్కొన్నాయి. అలాగే, ఈ జాయింట్ వెంచర్ నుంచి 5జీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెడికల్, హెల్త్‌కేర్, పరిశ్రమలు, క్లీన్‌టెక్, డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి పరిశ్రమలకు కావాల్సిన వస్తువులను తయారు కానున్నాయి.