- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఆర్ రెహమాన్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఆస్కార్ పాటపై సంచలన ఆరోపణలు!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV), మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) గురించి ఒక పేలుడు లాంటి నిజాన్ని బయటపెట్టారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV), మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) గురించి ఒక పేలుడు లాంటి నిజాన్ని బయటపెట్టారు. గతంలో దర్శకుడు సుభాష్ ఘై ‘యువరాజ్’ సినిమా కోసం రెహమాన్‌ను కోట్లు ఇచ్చి బుక్ చేసుకున్నారట. అయితే రెహమాన్ పని ఆలస్యం చేస్తుండటంతో విసిగిపోయిన సుభాష్ ఘై స్టూడియోకి వెళ్లగా.. అక్కడ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కంపోజ్ చేసిన ఒక ట్యూన్‌ను రెహమాన్ ఆయనకు వినిపించారట. దీనిపై సుభాష్ ఘై తీవ్రంగా కోప్పడుతూ.. ‘‘నేను నీకు 3 కోట్లు ఇచ్చింది నీ మ్యూజిక్ కోసం, సుఖ్వీందర్ కోసం కాదు’’ అని అరిచారట. దానికి రెహమాన్ చాలా కూల్‌గా.. ‘‘మీరు నా పేరుకే డబ్బులిస్తున్నారు, నా పనికి కాదు.. నచ్చితే తీసుకోండి లేదంటే లేదు’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆర్జీవీ వెల్లడించారు.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ తర్వాత రెహమాన్ చెన్నై వెళ్ళిపోయి, సుఖ్వీందర్‌కు ఫోన్ చేసి ఆ ట్యూన్‌ను పూర్తి చేసి పంపమన్నారట. సరిగ్గా ఏడాది తర్వాత సుఖ్వీందర్‌కు రెహమాన్ మేనేజర్ నుంచి 5 లక్షల రూపాయల చెక్కు అందింది. ఎందుకని అడిగితే.. ‘‘నువ్వు చేసిన ఆ ట్యూన్‌ను రెహమాన్ ఒకరికి అమ్మారు, అందులో నీ వాటా ఇది’ అని చెప్పారట. ఆ పాట మరేదో కాదు.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగి, ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ‘జై హో’. సుభాష్ ఘై వద్దన్న అదే ట్యూన్‌ను రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ కోసం వాడారని, అలా ఆస్కార్ అందుకున్న ఆ పాట వెనుక సుఖ్వీందర్ సింగ్ కృషి ఉందంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలతో పెద్ద వివాదమే మొదలయ్యేలా కనిపిస్తోంది.
Read More..






