- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ నది ప్రక్షాళన జరగాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలది అక్కసు. అభివృద్ధి కోసం మోడీ-కాంగ్రెస్ సహకరించుకున్న సబర్మతిని చూసి రావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్.

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు చెప్పారని, డ్రైనేజీ వాటర్ ను క్లీన్ చేసి పంప్ చేయడమే కాకుండా గోదావరి నీళ్లను మూసీకి తీసుకు రావడం లక్ష్యంగా సీఎం ప్రణాళికలు రూపొందించారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సబర్మతి, గంగా నది ప్రక్షాళన జరిగిన విధంగా మూసీ నది ప్రక్షాళన కూడా జరగాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎంపీగా తాను సబర్మతి రివర్ ను సందర్శించానని, అక్కడ 21 కిలోమీటర్లకు పదివేల కుటుంబాలను సబర్మతి పరివాహక ప్రాంతం నుంచి తరలించారని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
గుజరాత్ లో బీజేపీ సీఎం నరేంద్ర మోడీ, కాంగ్రెస్ కి చెందిన అహ్మదాబాద్ నగర మేయర్ ఇమ్మత్ సింగ్ పటేల్ ఇద్దరూ కలిసి సబర్మతి సరోవర్ అభివృద్ధి చేశారని, అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ సహకారం చేసుకున్నాయన్నారు. గాంధీ సరోవర్ 70 కోట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే కానీ, గాంధీ విగ్రహం 5 వేల కోట్లు అవుతుందని కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అంతా కలిసి సబర్మతి రివర్ ను చూసి రావాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి వారికి సూచించారు. మూసీ ప్రక్షాళనకు సీఎం సిద్దపడితే కేటీఆర్ కు ఎందుకు అక్కసని చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
సీఎం పవర్ పాయింట్ కి పోటీగా కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చి అబద్దాలు చెప్పారన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో మూసీని ఎందుకు అభివృద్ధి చేయలేదు కేటీఆర్ సమాధానం చెప్పాలని, సీఎం అయిన తర్వాత చేద్దామని కేటీఆర్ కలలు కన్నారా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాట బీజేపీ నేతలు పాడుతున్నారని, ఆ రెండు పార్టీల నేతలు మిత్రులుగా మారారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చిందని, కేటీఆర్ ఎక్కడికి వస్తావో చెప్పు మీ సిరిసిల్ల రావాలా మీరు భువనగిరికి వస్తారా అని ఆయన సవాల్ విసిరారు.






