తొలిసారి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి భేటీ (వీడియో)

by Disha Web Desk |
తొలిసారి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి భేటీ (వీడియో)
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల వరుస వివాదాల తర్వాత సీఎల్పీలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఈడీ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్​రెడ్డి సీఎల్పీకి వచ్చారు. ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడే ఉన్నారు. దీంతో ఇద్దరూ ఆప్యాయతతో కౌగిలించుకున్నారు. ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి మీడియాకు ఫోజులిచ్చారు.

వివాదాల తర్వాత తొలిసారి

రేవంత్​ రెడ్డికి టీపీసీసీ పట్టం తర్వాత జగ్గారెడ్డి తరుచూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. రేవంత్​రెడ్డిని పదవి నుంచి తొలిగించాలనే డిమాండ్​ మాత్రమే కాకుండా.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై సైతం వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు, నిరుద్యోగుల అంశం, ఐఏఎస్‌లపై రేవంత్​ చేసిన విమర్శలను జగ్గారెడ్డి కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీకి రేవంత్​రెడ్డి వచ్చారు. అదే సమయంలో సీఎల్పీలోనే ఉన్న జగ్గారెడ్డి.. రేవంత్​ రావడంతో చాంబర్​కు వెళ్లకుండానే బయటకు వెళ్లిపోయారు.

తాజాగా శుక్రవారం సీఎల్పీకి వచ్చిన రేవంత్​రెడ్డి నేరుగా సీఎల్పీ నేత చాంబర్​కు వెళ్లిన సమయంలో అక్కడే జగ్గారెడ్డి ఉన్నారు. దీంతో ఇద్దరూ పలుకరించుకుని చేతిలో చేయ్యి వేసి మీడియాకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి చలోక్తులు విసిరారు. తామిద్దరిదీ ఒకే స్కూల్​ అంటూ పేర్కొన్నారు. జగ్గన్నా.. తాను ఒక్కటేనని, పార్టీ కోసమే పని చేస్తామంటూ వ్యాఖ్యానించారు. వీరిద్దరి భేటీ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.



Next Story

Most Viewed