టీటీడీ జేఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్ నియామకం

by Malleboina Mahesh |

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్) గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

టీటీడీ జేఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెల్త్ & ఎడ్యుకేషన్) గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఆయన, బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ నియామకానికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జీవో ఆర్టీ నెంబర్ 110ను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఉత్తర్వులను జారీ చేస్తూ, తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ (ఎండోమెంట్) శాఖను ఆదేశించారు. గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన శరత్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.

Next Story