- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో హంగ్ దిశగా ఫలితాలు.. ఏ పార్టీకీ దక్కని స్పష్టమైన మెజారిటీ
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే, ఏఐడీఎంకే మధ్య పోరు ఉత్కంఠగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో రాజకీయ పరిణామాలు (Political consequences) ఎవరూ ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అలాగే ఏఐడీఎంకే పార్టీ 70కి పైగా స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అధికార డీఎంకే 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో హంగ్ ఏర్పడే దిశగా సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, ఏ ఒక్క పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ దక్కేలా కనిపించడం లేదు.
అధికార డీఎంకే (DMK) మూడో స్థానానికి పడిపోగా, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK), ప్రతిపక్ష ఏఐడీఎంకే (AIADMK) పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే స్థానాలే రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి, దీంతో తమిళ రాజకీయం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనే స్పష్టత రానుంది.






