- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ కథనానికి స్పందన
సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామ శివారులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద వంగిపోయిన విద్యుత్ స్తంభాల సమస్య ఎట్టకేలకు తీరింది.

దిశ, సదాశివ నగర్: సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామ శివారులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద వంగిపోయిన విద్యుత్ స్తంభాల సమస్య ఎట్టకేలకు తీరింది. ఈ సమస్య పై ‘దిశ’ దినపత్రికలో ప్రమాదకర స్థితిలో కరెంటు స్తంభాలు శీర్షిక ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఏ క్షణంలో నైనా స్తంభాలు కూలి ప్రమాదం జరగవచ్చని గ్రామస్తులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘దిశ’ కథనం ద్వారా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యుత్ శాఖ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. వంగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను అమర్చి బలంగా ఉండేలా మరమ్మత్తులు చేశారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను లాగి సక్రమంగా అమర్చడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చేసిన దిశ పత్రికకు అలాగే వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులకు సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.






