రాజధానిలో గణతంత్ర వేడుకలు షురూ.. నిఘా నీడలో కర్తవ్యపథ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 02:08:40  IST  )

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.

రాజధానిలో గణతంత్ర వేడుకలు షురూ.. నిఘా నీడలో కర్తవ్యపథ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో జరగనున్న పరేడ్ కోసం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 30 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇందులో ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు (CAPF) కూడా ఉన్నాయి. ఉగ్రవాద ముప్పు హెచ్చరికల నేపథ్యంలో, రాజధాని అంతటా ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

హైటెక్ నిఘా.. 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

భద్రతా పర్యవేక్షణ కోసం కర్తవ్యపథ్ పరిసరాల్లో ప్రత్యేకంగా 6 హైటెక్ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) వంటి అత్యాధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది వేడుకలకు మరో ప్రత్యేకత ఉంది. సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాన్యులతో కలిపి మొత్తం 10 వేల మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం పిలిచింది. వారందరి కోసం ప్రత్యేక గ్యాలరీలను అధికారులు సిద్ధం చేశారు.

Next Story