- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండల కేంద్రంలోనే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి.. వినతిపత్రం అందజేత
జిల్లేడు చౌదరి గూడెం మండల కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్‌ను లాల్ పహాడ్‌లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని అధికారులను జేఏసీ నాయకులు కోరారు.

దిశ, షాద్ నగర్: జిల్లేడు చౌదరి గూడెం మండల కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్‌ను లాల్ పహాడ్‌లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని అధికారులను జేఏసీ నాయకులు కోరారు. మండల కేంద్రంలోనే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మండల కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్‌ను లాల్ పహాడ్ లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అధికారులు పునఃపరిశీలించాలని కోరారు. చౌదర్‌గూడకు చారిత్రక ప్రాధాన్యంతో పాటు ప్రస్తుతం వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిందని జేఏసీ నాయకులు తెలిపారు.
మార్కెట్, బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రధాన సౌకర్యాలు మండల కేంద్రంలోనే ఉండడంతో మండల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌స్టేషన్‌ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు పోలీసు సేవలు వేగంగా అందుతాయని, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






