- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట
గిగ్ వర్కర్లకు కేంద్రం ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: గిగ్ వర్కర్లకు కేంద్రం ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. పది నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ నిర్ణయాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. 10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), బ్లింకిట్(Blinkit) సహా అన్ని ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం సూచనలు చేసింది. పది నిమిషాల నిబంధనను ఎత్తివేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.






