30 రోజుల వాలిడిటీతో Jio, Airtel, Vodafone Idea రిచార్జ్ ప్లాన్‌లు

by Disha Web Desk 17 |
30 రోజుల వాలిడిటీతో Jio, Airtel, Vodafone Idea రిచార్జ్ ప్లాన్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని మూడు పెద్ద టెలికాం కంపెనీలు అయినటువంటి రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు వినియోగదారుల కోసం కొత్త రిచార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. ఇంతకు ముందు రిచార్జ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉండేవి. కానీ ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం ఆపరేటర్‌లను కనీసం 30 చెల్లుబాటు అయ్యే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ని చేర్చాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీంతో దేశీయ దిగ్గజ కంపెనీలు 30 రోజులు చెల్లుబాటు అయ్యే కొత్త రిచార్జ్ ప్లాన్‌లను తెచ్చాయి.

రిలయన్స్ జియో:

ప్లాన్ ధర రూ. 296. వాలిడిటీ 30 రోజులు. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 25GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్:

రూ. 296 రీచార్జ్ ప్యాక్‌ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMS/రోజు నెలకు 25GB డేటాను అందిస్తుంది.

రూ. 319 ప్లాన్‌. ఇది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్యాక్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా:

30 రోజుల చెల్లుబాటుతో రూ.327 ప్యాక్‌ను అందిస్తోంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS 30 రోజుల చెల్లుబాటులో 25GB డేటాను అందిస్తుంది.

రూ. 337 ప్లాన్‌ 31 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS 28GB డేటాను అందిస్తుంది.


Next Story