- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫ్ డిక్లరేషన్‌తో సాదాబైనామాల క్రమబద్ధీకరణ
భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సెల్ఫ్ డిక్లరేషన్‌తో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మోక్షం లభించినట్టయ్యింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలును కొందరు సీనియర్ అధికారులు ప్రశ్నార్థకం చేశారు. చట్టానికి భిన్నంగా రూల్స్‌ను రూపొందించడం వల్ల 3 నెలల్లో పూర్తి కావాల్సిన సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం ఆర్నెళ్లయినా దొరకడం లేదు. 9 లక్షల దరఖాస్తుల్లో 9 వేలు కూడా ఆమోదానికి నోచుకోలేదు. అమ్మిన వ్యక్తి సమ్మతి అవసరం అంటూ ఏసీ గదుల్లో కూర్చొని నిబంధనలు రూపొందించిన ఐఏఎస్ అధికారులపై జనం మండిపడ్డారు. ఇదే విషయంపై ‘దిశ’ పలుమార్లు గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా అమ్మిన వ్యక్తి ప్రమేయం లేకుండానే ఫీల్డ్ ఎంక్వయిరీతో చేయించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
కేవలం కొనుగోలు చేసిన వ్యక్తి అఫిడవిట్ సమర్పించడం ద్వారా రెగ్యులరైజ్ చేయడానికి జీవో 76ను జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం శాసనమండలిలో ప్రకటించారు. త్వరలోనే సవరణలతో కూడిన గైడ్ లైన్స్ రాబోతున్నట్లు సమాచారం. దీని ద్వారా త్వరితగతిన 9 లక్షల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అయితే, ఇన్నాళ్లు అమ్మిన వ్యక్తి తాను అమ్మేసినట్లు అఫిడవిట్ ఇవ్వడానికి ముందుకు రారని, రావడం లేదన్న క్షేత్ర స్థాయి వాస్తవాలను తహశీల్దార్లు, దరఖాస్తుదారులు చెబుతూ నే ఉన్నారు. అది నిజమేనని రెవెన్యూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలు సైతం గుర్తించారు. కానీ, కొందరు ఐఏఎస్ అధికారులు మా త్రం అదేదో జరిగిపోతుందన్న అభూత కల్పనలను అల్లి కాలయాపన చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకు న్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
దరఖాస్తుల క్లియరెన్స్ అనివార్యం
రాష్ట్రంలో 9 లక్షల అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయంటే సుమారు 18 లక్షల ఎకరాలకు పైగానే విస్తీర్ణం ఉంటుంది. ప్రతి ఊరిలోనూ కనీసం 50కి పైగా రైతుల భూమి హక్కులు ప్రశ్నార్థకంగా మిగులుతోంది. వీళ్లకు భూమి ఉంటుంది.. కానీ, ప్రభుత్వం హక్కులు కల్పించడం లేదు. ఇప్పటికే వారు రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలు, రుణ మాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఇప్పటికైనా నిజమైన భూమి హక్కుదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం అనివార్యమని రెవెన్యూ నిపుణులు భూమి సునీల్ పలు సందర్భాల్లో అధికారులకు వివరించారు.
సర్వే చేయాలంటే క్లియరెన్స్ ఉండాల్సిందే..
ప్రతి ఊరిలోనూ కనీసం 30 నుంచి 40 సర్వే నంబర్లు సర్వే చేయకుండా పెండింగులో ఉంటాయి. దీందో పక్క సర్వే నంబర్లలోని విస్తీర్ణంపైనా ప్రభావం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైవాట్ కబ్జాలు అధికం. ఈ క్రమంలో ప్రతి సర్వే నంబరులోని విస్తీర్ణం, దానికి సంబంధించిన హక్కుదారుల లెక్క తేలితేనే సర్వే చేయడానికి కుదురుతుంది. ఇవన్నీ ఇలాగే పెండింగులో ఉంచడం ద్వారా సర్వే ప్రక్రియ మొదలు పెడితే తిరిగి సరిహద్దు వివాదాలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయని రెవెన్యూ అంటున్నాయి.
ఖమ్మంలోనే అధికం
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత జిల్లాలోనే సాదాబైనామా దరఖాస్తులు అధికం. ఆరేండ్లుగా ఈ దరఖాస్తులు పెండింగు లో ఉండడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టాలు మంత్రికి తెలుసు. భూ భారతి చట్టం ద్వారా 9 లక్షల కుటుంబాలకు మేలు చేయాలని రూపకర్తలు నిర్ణయించారు. కానీ, గైడ్ లైన్స్‌లో క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు రూపొందించిన మార్గదర్శకాలు ఒక్క శాతం అప్లికేషన్లు కూడా పరిష్కరించేందుకు వీలు కల్పించలేదు. దీంతో రైతు సంక్షేమ కమిషన్ తరఫున చైర్మన్ ఎం.కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్‌లు పలుమార్లు మంత్రి పొంగులేటి, సీఎం, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 20, 30 ఏళ్ల క్రితం అమ్మినోళ్లు ఇప్పుడు అఫిడవిట్ ఎలా ఇస్తారని సీఎం సైతం అభిప్రాయపడ్డారు. రెండు నెలల తర్వాత జీవో 76 విడుదల చేసినట్లు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
- Tags
- Bhubharati Act






