సూపర్ న్యూస్ తక్కువ ధరలో realme కొత్త స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
సూపర్ న్యూస్ తక్కువ ధరలో realme కొత్త స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: Realme సంస్థ కొత్తగా C-సిరీస్‌లో భాగంగా C31 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఇది Unisoc T612 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. డిజైన్ పరంగా మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది.

Realme C31 స్పెసిఫికేషన్స్

* 6.5-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లే, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.

* Android 11-ఆధారిత Realme UI R ఎడిషన్‌‌లో 12nm Unisoc T612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

* గరిష్టంగా 4GB RAM 64GB స్టోరేజీతో రానుంది.

* ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

* ముందు భాగంలో 4x డిజిటల్ జూమ్‌తో 13MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి.

* సెల్ఫీల కోసం 5MP కెమెరాను అమర్చారు.

* మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు.

* ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది.




3GB + 32GB స్టోరేజ్ మోడల్‌ రూ. 8,999, 4GB + 64GB వేరియంట్ ధర రూ. 9,999.

ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ గ్రీన్, లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart, ఆఫ్‌లైన్ రిటైల్ షాప్‌లలో అందుబాటులో ఉంటుంది.


Next Story