- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న జయ ప్లాటినం.. నేడు జయ డైమండ్స్.. చేతులెత్తేస్తున్న బిల్డర్లు
వరుసగా రియల్ ఎస్టేట్ సంస్థలు బోర్డులు ఎత్తేస్తుండటంతో ప్రజలు ఫ్లాట్స్, స్థలాలు కొనాలంటేనే భయపడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతున్నా యి. ప్రీ లాంచింగ్ ఆఫర్లతో డెవలపర్లు మోసం చేస్తుంటే.. డబ్బులు కట్టించుకుని ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేయకుండానే బి ల్డర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతోపాటు ప్లా ట్లు, ఇండ్లు కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ మోసాలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి అథారిటీ (టీజీ రెరా) ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పూర్తిచేయాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది.
నిన్న జయ ప్లాటినం.. నేడు జయ డైమండ్
వినియోగదారులకు రెరా అండగా నిలుస్తోంది. చట్టం ప్రకారం వినియోగదారుల హక్కులను కాపాడుతోంది. ఒక వేళ బిల్డర్ సదరు ప్రాజెక్టు పూర్తిచేయకుండానే వెళ్లిపోతే.. ఆ ప్రాజెక్టును పూర్తిచేయడానికి బాధ్యతలు సైతం తీసుకుంటోంది. ఇప్పటికే జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిన జయ ప్లాటినం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి చర్యలు ప్రారంభించింది. తాజాగా జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన జయ డైమండ్ ప్రాజెక్టును సైతం టేకప్ చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులే కాదు భవిష్యత్తులోనూ చట్ట ప్రకారం ఇలాంటి చర్యలు చేపట్టడానికి వెనుకాడేదిలేదని రెరా స్పష్టం చేస్తోంది.
జయ డైమండ్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి ప ర్మిట్ నంబర్ హెచ్ఎండీఏ/2021 ప్రకారం అనుమతి పొందింది. సెల్లార్ + గ్రౌండ్ + 5పై అంతస్తులతో కూడిన భవనం, 3166.80 చదరపు మీటర్లు లేదా 3787.43 చదరపు గజాల విస్తీర్ణంలో మొత్తం 83 ఫ్లాట్‌లు, క్లబ్‌హౌస్‌లను నిర్మించనున్నట్టు బిల్డర్ పర్మిషన్ తీసుకున్నారు. 2022 ఫిబ్రవరి వరకు ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతిలేదని గుర్తించిన ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఇస్కీ)ని టెక్నికల్ ఏజెన్సీగా నియమించింది. దీంతోపాటు ప్రాజెక్టు విచారణలో ప్రాజెక్టు నిర్మాణ పనులు 6 శాతం మాత్రమే పూర్తయినట్లు ఇస్కీ గుర్తించింది. ప్లాట్ ఓనర్ల నుంచి రూ. 23,26,85,905 కన్నా ఎక్కువ వసూలు చేసింది. రెరా చట్టానికి విరుద్ధంగా ప్లాట్ ఓనర్ల నుంచి 10 శాతం కన్నా ఎక్కువగానే వసూలు చేసినట్టు గుర్తించారు.
ప్రాజెక్టు పూర్తికి పర్యవేక్షణ కమిటీ
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మధ్యలోనే వదిలేసిన జయ డైమండ్ ప్రాజెక్టు పూర్తిచేయడానికి రెరా బాధ్యతలు తీసుకున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఓ కమిటీని సైతం నియమించింది. ఈ కమిటీ కన్వీనర్‌గా టీజీ రెరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-1ను అథారిటీ నియమించింది. ఈ కమిటీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఒక అధికారి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జోనల్ కమిషనర్/డిప్యూటీ కమిషనర్ ఒక ప్రతినిధి, స్థానిక సబ్ రిజిస్ర్టార్ లేదా వారి నామినీ, డీఆర్ఓ ద్వారా నామినేట్ చేసిన స్థానిక తహశీల్దార్ లేదా వారి నామినీ, టీజీ రెరా నుంచి ఒక అధికారి, క్రెడాయ్ ద్వారా నామినేట్ చేసిన ఒక సభ్యుడు, నరేడ్కో ద్వారా నామినేట్ చేసిన ఒక సభ్యుడు, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కార్యదర్శి, ప్లాట్స్ ఓనర్స్ అసిసోయేషన్స్ ట్రెజరర్, అధ్యక్షుడు, ఇస్కీ నుంచి ఒక సభ్యుడు ఉంటారు. దీంతోపాటు ఆడిట్ నిర్వహించడానికి ఒక ఆడిటర్‌ను సైతం నియమించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించడంతోపాటు రెరాకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
- Tags
- Real Estae
- Fruad






