WPL.. ఫైనల్లోకి దూసుకువెళ్లిన RCB

by Muthe.Rajitha |

WPL 2026లో RCB మహిళల జట్టు అద్భుతంగా ఆడి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

WPL.. ఫైనల్లోకి దూసుకువెళ్లిన RCB
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టు అద్భుతంగా ఆడి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, యూపీ వారియర్స్ 20 ఓవర్లలో సుమారు 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

తర్వాత బరిలోకి దిగిన RCB బ్యాటర్లు పరుగుల వరద పారించారు. 13.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. గ్రేస్ హారిస్ (75), స్మృతి మంధాన (54), జార్జియా వోల్ (16) పరుగులు చేసారు. కాగా RCB మహిళల జట్టు ఫైనల్ కు వెళ్ళడం ఇది రెండవసారి. 2024లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచి కప్పు సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి ట్రోఫీ తప్పకుండా RCBదే అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story