- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LSG పై గెలుపుపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్
లక్నోపై ఆర్సీబీ ఘనవిజయం! పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన బెంగళూరు. టాస్ గెలవడమే టర్నింగ్ పాయింట్ అన్న రజత్ పాటిదార్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా బుధవారం సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium, Bangalore) వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడింది. ఈ మ్యాచులో ఆర్సీబీ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ఈ విజయంలో టాస్ గెలవడం కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. పిచ్ పరిస్థితులను అంచనా వేసి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమని, తమ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేశారని ఆయన తన జట్టు సభ్యులను కొనియాడారు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ కాగా, ఆర్సీబీ బౌలర్ రాసిఖ్ సలామ్ దార్ (4/24) వికెట్లతో చెలరేగాడు. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 27 పరుగులతో రాణించాడు. జట్టులో సీనియర్ బౌలర్లు ఉండటం వల్ల తన కెప్టెన్సీ పని సులభం అవుతోందని పాటిదార్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నప్పటికీ, టైటిల్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.






