- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI RepoRate: ఆర్బీఐ 'పాస్' బటన్.. ఎవరికి పండగ? ఎవరికి దండగ?
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ ఏడాది మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను ఫిబ్రవరి 6, 2026న వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రేపో రేటను యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ ఏడాది మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్ణయాలను ఫిబ్రవరి 6, 2026న వెల్లడించింది. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏకగ్రీవంగా కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.
గత డిసెంబర్ 2025 సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఎటువంటి మార్పులు చేయకుండా 'పాస్' ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని (Global economic uncertainty) దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నిర్ణయం ఎవరికి లాభం చేకూరుస్తుంది. ఎవరిని నష్టాన్ని చేకురుస్తుందో ఇక్కడ మనం తెలుసుకుందాం.
లోన్ తీసుకొని ఈఎంఐ కట్టే వారికి ఊరట
భారత రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించడం లోన్లు తీసుకొని ఈఎంఐ కట్టేవారికి ఊరట కలుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారు ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవడంతో బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీలను పెంచే అవకాశం తక్కువ. ఫలితంగా లోన్లు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐ (EMI) భారం పెరగకుండా స్థిరంగా ఉంటుంది. కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రస్తుతమున్న వడ్డీ రేట్ల వద్దే రుణాలు లభించే అవకాశం ఉంది.
డిపాజిటర్లకు, పొదుపు చేసే వారికి నిరాశ..
RBI రేపో రేటను పెంచకుండా 'పాస్' ఇవ్వడంతో డిపాజిటర్లకు, పొదుపు చేసే వారికి నిరాశ ఎదురైంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) చేసి వడ్డీపై ఆధారపడే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ నిర్ణయం కొంత నిరాశ కలిగించవచ్చు. ఆర్‌బీఐ రేట్లను పెంచకపోవడం వల్ల బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచవు. గతంలో రేట్లు తగ్గిన ప్రభావంతో ఇప్పుడు లభిస్తున్న తక్కువ వడ్డీతోనే డిపాజిటర్లు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. దీనివల్ల పొదుపు పై వచ్చే ఆదాయం పెరగదు.
భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై ప్రభావం
ఆర్‌బీఐ రెపో రేటును పెంచకుండా.. 5.25 వద్దనే 'తటస్థంగా ఉంచడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ (Economy of the country)లో ఒక రకమైన స్థిరత్వం కనిపిస్తుంది. వడ్డీ రేట్లు పెరగకపోవడం వల్ల కంపెనీల రుణ భారం పెరగదు. ఇది స్టాక్ మార్కెట్ల (Stock markets)కు సానుకూలమైన అంశం. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని (Inflation) 4 శాతానికి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న ఆర్‌బీఐ, భవిష్యత్తులో ధరల పెరుగుదలను నిరోధించేందుకు ఈ 'పాజ్' నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దీంతో ఆర్బీఐ నిర్ణయం (RBI decision) దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా కొనసాగించాలనే లక్ష్యానికి దోహదం కానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






