- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీకి ఊహించని షాక్.. దేశ ద్రోహులతో కరచాలనం చేయను: రవ్‌నీత్ సింగ్ బిట్టు ఘాటు వ్యాఖ్యలు
పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చారు. లోక్‌సభలోని మకర్ ద్వార్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీల మీదుగా బిట్టు వెళ్తున్న సమయంలో, రాహుల్ గాంధీ ఆయనను ఉద్దేశించి "ఒక ద్రోహి ఇటుగా వెళ్తున్నాడు.. ముఖం చూడండి.. హలో ఫ్రెండ్, నువ్వు మళ్ళీ కాంగ్రెస్‌లోకి వస్తావు" అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బిట్టు అత్యంత తీవ్రంగా స్పందించారు.
రాహుల్‌కు బిట్టు స్ట్రాంగ్ కౌంటర్
పార్లమెంట్ ఎంట్రీ మెట్లపై అడ్డుగా కుర్చున్న వారు.. ఎంపీ బిట్టూ అటుగా వెళ్తున్న సమయంలో ఆయనను ఉద్దేశించి "ఒక ద్రోహి ఇటుగా వెళ్తున్నాడు.. ముఖం చూడండి అంటూ రాహుల్ గాంధీ సెటైర్లు వేశాడు. ఈ వ్యాఖ్యలు బిట్టు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆయనకు రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు చేయి చాచగా, బిట్టు దానిని తిరస్కరించారు. "మీరు దేశ ద్రోహులు, దేశ శత్రువులు, రోజూ సైన్యంపై, దేశంపై వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో నేను కరచాలనం చేయను" అని ముఖం మీదే చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా షాక్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అతనిపై మండిపడ్డాడు. అనంతరం రవ్‌నీత్ సింగ్ బిట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇది జరిగిన కొద్ది సేపటికి బిట్టు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబంపై సంచలన ఆరోపణలను చేశాడు. గాంధీ కుటుంబం పంజాబ్‌ను తగలబెట్టిందని, స్వర్ణ దేవాలయంపై బుల్లెట్లు కురిపించి వేలాది మంది సిక్కులను, పంజాబీలను పొట్టనబెట్టుకుందని బిట్టు ఆరోపించారు. "సిక్కుల హంతకుల కుటుంబానికి చెందిన వ్యక్తితో నేను చేయి కలపను" అని స్పష్టం చేశారు. అలాగే రాజీవ్ గాంధీని 'షహీద్' (అమరవీరుడు) అని పిలిస్తే, సర్దార్ బియాంత్ సింగ్‌ను కూడా 'షాహిద్-ఏ-అజాం' అని పిలవాలని, తాను కూడా అమరవీరుడి కుటుంబం నుండి వచ్చానని తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఏదో చక్రవర్తిలా చేయి చాచారని, ఆయన తనను తాను ఈ దేశానికి, ప్రపంచానికి యజమానిగా భావిస్తున్నారని విమర్శించారు.
తాను గాంధీ కుటుంబానికి చెందకపోయినా, తన తలపై సిక్కుల గౌరవమైన తలపాగా (Turban) ఉందని బిట్టు గర్వంగా ప్రకటించారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం అమరవీరుడి మనవడిగా కనిపించానని, బీజేపీలో చేరగానే ద్రోహిగా కనిపిస్తున్నానా? అని బిట్టు ప్రశ్నించారు. ఈ ఘటనతో పార్లమెంట్ పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాహుల్ వ్యాఖ్యలపై ఇతర సభ్యులు స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు.






