Ravi Teja: మెదక్‌‌లో రవితేజ సినిమా షూటింగ్.. అభిమానులకు నిరాశ

by Vinod kumar |   (  Updated:2022-04-11 13:17:46  IST  )

దిశ, మెదక్: మెదక్ వెస్లీ కళాశాలలో సోమవారం - Ravi Teja film shooting in Medak district .. disappointment for fans

Ravi Teja: మెదక్‌‌లో రవితేజ సినిమా షూటింగ్.. అభిమానులకు నిరాశ
X

దిశ, మెదక్: మెదక్ వెస్లీ కళాశాలలో సోమవారం ప్రముఖ హీరో రవితేజ నటిస్తున్న సినిమాకు సంబంధించి షూటింగ్ చేశారు. వెస్లీ కళాశాలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ చీరాల సంబంధించిన షూటింగ్ నిర్వహించాను. ఇందులో హీరోయిన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజీకి వెళ్తున్న దృశ్యాలతో పాటు పాత కాలానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే మధ్యాహ్నం తర్వాత హీరో రవితేజ పై కూడా పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు.

దీంతో హీరో, హీరోయిన్లను చూసేందుకు వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. సినిమా బ్యానర్ దర్శకనిర్మాతలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. గోల్ బంగ్లాగా పిలువబడే వెస్లీలో గతంలో రవితేజ నటించిన కృష్ణ సినిమా సన్నివేశాలను అప్పట్లో షూట్ చేశారు. ఈసారి కూడా రవితేజకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సై, జార్జి రెడ్డి తదితర చిత్రాలను ఇదే కళాశాలలోనే చిత్రీకరించారు.

Next Story