అతడు ఫిట్ అయితే.. ఆపడం ఎవరి తరం కాదు: రవిశాస్త్రి

by Vinod kumar |

ముంబై: ఆతిథ్య ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో - Ravi Shastri comments on T20 World Cup selection

అతడు ఫిట్ అయితే.. ఆపడం ఎవరి తరం కాదు: రవిశాస్త్రి
X

ముంబై: ఆతిథ్య ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు ఎంపికలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానం గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'పాండ్యా ఫిట్‌గా ఉంటే అతన్ని ఆపడం ఎవరితరం కాదు. సెలక్టర్లు కూడా అతన్ని అడ్డుకోలేరు. ఐపీఎల్‌లో ఆడుతున్న పాండ్యా ఆటతీరును ప్రస్తుతం దేశం మొత్తం గమనిస్తోంది.


అతడు మంచి ప్రదర్శన కనబరుస్తాడని నేను నమ్ముతున్నా' రవిశాస్త్రీ చెప్పుకొచ్చాడు.ఇదిలాఉండగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా సోమవారం జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జాయంట్స్‌ను ఓడించి గ్రాండ్ విక్టరీ కొట్టాడు.

Next Story