- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇబ్రహీంపట్నంలో రేషన్ బియ్యం మాఫియా గుట్టురట్టు
ఇబ్రహీంపట్నంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు! రెండు రోజుల్లో 800 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. రైస్ మిల్లులు, గోదాములపై దాడులు.

దిశ, ఇబ్రహీంపట్నం : పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతూ అక్రమార్కుల జేబులు నింపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పేదలకు ఉచితంగా రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. అయితే ఈ రేషన్ బియ్యం నేరుగా దళారుల చేతిలోకి వెళ్లి వారికి కాసుల పంట కురుపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. రెండు రోజుల వ్యవధిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో సుమారుగా 800 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది చూస్తే అక్రమ రేషన్ బియ్యం దందా ఏరేంజ్‌లో జరుగుతుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.
పక్క రాష్ట్రాల్లో విక్రయాలు..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారుగా మొత్తం మూడు లక్షలకు పైగా జనాభా ఉంది. కాగా ప్రభుత్వం ప్రతి నెల ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. ప్రస్తుత వేసవి కాలం దృష్టా, ప్రజలు ఇబ్బందులు గురికాకుండా ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో(ఏప్రిల్) పంపిణీ చేసింది. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్క రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసింది.
డీలర్ల వద్ద నుంచి నేరుగా..
ఐతే రేషన్ బియ్యం రేషన్ డీలర్ల వద్ద నుంచి నేరుగా అక్రమార్కుల చేతిలోకి వెళ్తుందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అలాగే కొంతమంది ప్రజల వద్ద దళారులు కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేసి, పక్క రాష్ట్రాల్లో రూ.18 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములలో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. నిల్వ చేసిన బియ్యాన్ని పక్క రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది.
కాగా రెండు రోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కావడిపల్లి గ్రామ శివారులోని గోదాంలో రేషన్ బియ్యాన్ని తరలించడానికి సిద్ధంగా ఉంచారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు గోదాంపై దాడి చేశారు. గోదాం నిర్వాహకుడు, ముగ్గురు డ్రైవర్లతో పాటు భారీ కంటైనర్‌లో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం, అశోక్ లేలాండ్ వాహనం, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. దందాలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రైస్ మిల్లులో 500 క్వింటాళ్లు..
మంగళ్‌పల్లిలోని ఓ రైస్ మిల్లులో 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారు. మంగళవారం విశ్వనీయ సమా చారం మేరకు ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీఎస్ఓ వనజాత, సివిల్ సప్లై విజిలెన్స్ డిఎస్పి జీ.వెంకటేశం, సీఐ పండరి బాసు, ఎస్ఐ సాంబశివరావు, డీటీ రామకృష్ణ శేష సాయి రైస్ మిల్లు పై దాడి చేశారు. 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.






