ఆ మున్సిపాలిటీలో దారుణం.. భర్త లేని టైమ్‌లో మామ కోడలిపై..

by Vinod kumar |

దిశ, అమరచింత: కొడుకు ఇంట్లో లేని - Rape incident in Amarachintha municipality of Wanaparthi district

ఆ మున్సిపాలిటీలో దారుణం.. భర్త లేని టైమ్‌లో మామ కోడలిపై..
X

దిశ, అమరచింత: కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి చంపిన దారుణ ఘటన వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ కృష్ణ నగర్ లో చోటు చేసుకుంది. ఈ నెల 10వ తేదీన సురేఖ(23) మృతి చెందిన ఘటన వెనుక నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్లుగా సంతానం కాలేదని సురేఖని అత్తమామలు తరచు వేదిస్తుండేవారు. కొడుకు మధు అమాయకుడు కావడంతో భార్య సురేఖను తండ్రి ఎంత వేధించిన పట్టించుకునేవాడుకాదని, కాలనీ మహిళలు చెప్పుకొచ్చారు.


కొడుకు ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో 9వ తేది రాత్రి చెరుకు తరలించేందుకు వెళ్ళాడు. ఆరోజు భార్య వెళ్ళొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా భర్త వెళ్లాడు. అది ఆసరాగా చేసుకుని మామ మద్యం మత్తులో ఉన్న (దమగ్నపురం బాబు) కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టి, గొంతు నులిమి చంపాడని బంధువులు, స్థానికులు ఆరోపించారు. అతి కిరాతకంగా చంపి, సంతానం కాలేదనే కారణంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

హంతకుడిని అరెస్టు చేయాలని..


కోడలిపై అత్యాచారం చేసిన హంతకుడు దమగ్నపురం బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, కాలనీ మహిళలు, బాధితురాలి బంధువులతో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా.. అందుకు కారకుడైన నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

బాధిత కుటుంబానికి రూ.3 లక్షల 50 వేలు ఇవ్వాలని పెద్దలు పంచాయతీ చేశారని, ఇంత దారుణమైన ఘటనను కప్పిపుచ్చుకునేందుకు డబ్బుల ఒప్పందం జరగడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇలా అయితే సమాజంలో మహిళలపై మరిన్ని అత్యాచారాలు, హత్యలు నిలువరించడం అసాధ్యమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితునికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానిక తహశీల్దార్ సిందూజ ను మహిళలు కోరారు.

Next Story