సిక్స్ ప్యాక్ ఆబ్స్‌తో రణ్‌వీర్.. కడక్ బిస్కెట్స్ అంటున్న ఫ్యాన్స్

by Disha Web Desk 12 |
సిక్స్ ప్యాక్ ఆబ్స్‌తో రణ్‌వీర్.. కడక్ బిస్కెట్స్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సిక్స్ ప్యాక్ ఆబ్స్‌ చూపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. నిరంతరం ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చే ఈ హీరో.. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన బాడీ షేప్స్‌తో అలరిస్తున్నాడు. అభిమానులను సైతం మోటివేట్ చేసేందుకు తన జిమ్ సెంటర్ నుంచి అనేక చిత్రాలు పంచుకుంటుంటాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా చొక్కా పైకెత్తి సిక్స్ ప్యాక్ ఆబ్స్‌ ప్రదర్శించిన నటుడు ఒళ్లంతా చెమటలు పట్టిన నయా లుక్ షేర్ చేస్తూ.. 'హ్యాడ్ టు గివ్‌అప్ మల్‌పువాస్' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుండగా స్పందించిన అర్జున్ కపూర్.. 'మండే మోటివేషన్.. జిమ్‌కి వెళ్లడానికి మాకు అవసరమైన అన్ని ప్రేరణలు ఇచ్చాడు' అంటూ రణ్‌వీర్ సామార్థ్యాన్ని పొగిడేయడం విశేషం. కాగా అభిమానులు సైతం 'నో వర్డ్స్ ఓన్లీ ఎమోషన్' 'కడక్ బిస్కెట్స్ భాయ్..' అంటూ ప్రశంసిస్తున్నారు.

Next Story

Most Viewed