- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెట్టింట్లో రచ్చలేపుతున్న రణబీర్ vs రణవీర్ ఫ్యాన్ వార్
బాలీవుడ్‌లో టాప్ నటులు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ అభిమానులు ఫ్యాన్ వార్ తో రచ్చ లేపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్‌లో టాప్ నటులు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ అభిమానులు ఫ్యాన్ వార్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. నటనతో పాటు వ్యక్తిత్వంతో కూడా అభిమానులను ఆకట్టుకునే ఈ ఇద్దరు హీరోల మధ్య ప్రత్యక్షంగా ఏ గొడవ లేకపోయినా, వారి అభిమానుల మధ్య మాత్రం నెట్టింట్లో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్, రెడ్డిట్ వంటి సోషల్ మీడియా వేదికలు "రణబీర్ vs రణవీర్"గా మారిపోయాయి. "రణబీర్ బెస్ట్ యాక్టర్" అని ఒక వర్గం, "రణవీర్ కి మించినవాడు లేడు" అని మరో వర్గం వాదిస్తోంది. ఈ ఫ్యాన్ వార్ రోజురోజుకీ ముదిరి, చివరకి అది ఎటువైపు దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్యాన్ వార్ సౌత్ హీరోల అభిమానుల మధ్యనే ఉంటుందనే అపోహ చాలాకాలం మీడియా వర్గాల్లో ఉండేది. కానీ ప్రస్తుత గొడవ చూస్తుంటే ఏ వుడ్ అయినా కాదేదీ ఫ్యాన్ వార్ కు అనర్హం అన్నట్టు తరయారైంది.
రణబీర్ ట్రూ యాక్టర్
రణబీర్ కపూర్ అభిమానులు అతని నటన సహజంగా ఉంటుందని, భావోద్వేగాలు సమపాళ్లలో చూపించగలడని చెబుతూ.. 'రాక్‌స్టార్', 'బర్ఫీ', 'సంజూ', 'యానిమల్' వంటి సినిమాల్లో రణబీర్ చేసిన పాత్రలు అతని నటనా ప్రతిభకు నిదర్శనమని అంటున్నారు. ముఖ్యంగా పాత్రలో పూర్తిగా లీనమవడం, ఓవర్ యాక్టింగ్ లేకుండా సీరియస్ పాత్రలను చేయగలగడం రణబీర్ బలమని అభిమానులు చెబుతున్నారు. అందుకే "రణబీర్ ట్రూ యాక్టర్" అనే హ్యాష్‌ట్యాగ్‌లు నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు.
బాలీవుడ్ బెస్ట్ పెర్ఫార్మర్ రణవీర్
మరోవైపు రణవీర్ సింగ్ అభిమానులు కూడా అతని ఎనర్జీ, వేరియేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతూ.. 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్', 'గల్లీ బాయ్', '83', దురంధర్ వంటి సినిమాల్లో రణవీర్ పూర్తిగా భిన్నమైన పాత్రలు చేసి విమర్శకుల మెప్పు పొందాడని చెబుతున్నారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం, పాత్ర కోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకోవడం రణవీర్ స్పెషాలిటీ అంటూ ఆయన అభిమానులు ఊదరగొడుతున్నారు. " హ్యాష్ ట్యాగ్ బాలీవుడ్ బెస్ట్ పెర్ఫార్మర్ రణవీర్" అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు.
కొత్త తలనొప్పులు
కాగా ఈ ఫ్యాన్ వార్ కొన్నిసార్లు హద్దులు దాటుతూ, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని.. ఒకరి సినిమాలను మరొకరు తక్కువ చేసి మాట్లాడడం ఆయా హీరోలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. కొంతమంది సినీ ప్రేమికులు మాత్రం రణబీర్, రణవీర్ ఇద్దరూ మంచి నటులను, ఒకరితో ఒకరిని పోల్చడం అవసరం లేదు, అభిమానులు సహనంగా ఉండాలని సూచిస్తున్నారు. హీరోలు వారు అంతా కలిసే ఉంటారని, వారికోసం ఫ్యాన్స్ కొట్టుకు చావాల్సిన అవసరం లేదని కూడా సుతిమెత్తగా మందలిస్తున్నారు.
కానీ సోషల్ మీడియా అల్గారిథమ్‌లు ఇలాంటి వివాదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఫ్యాన్ వార్ తగ్గకపోగా మరింత వైరల్ అవుతోంది. మొత్తానికి రణబీర్ vs రణవీర్ ఫ్యాన్ వార్ అనేది ఇద్దరు హీరోల మధ్య పోటీ కంటే కూడా అభిమానుల మధ్య పోటీగా మారింది. సినిమాల ద్వారా ఎవరు ఆకట్టుకుంటారనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు స్టార్ల పేర్లు నెట్టింట్లో రోజూ ట్రెండ్ అవుతుండటం, బాలీవుడ్‌పై వారి ప్రభావం ఎంత బలంగా ఉందో ఉదాహరణగా చూపిస్తోంది.






