కాంగ్రెస్ పార్టీ గంజాయి మొక్క: తెలంగాణ బీజేపీ చీఫ్

by Gantepaka Srikanth |

ఖమ్మం జిల్లా జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ గంజాయి మొక్క: తెలంగాణ బీజేపీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao) స్పందించారు. తులసివనంలో కాంగ్రెస్ గంజాయి మొక్క లాంటిదని విమర్శించారు. దేశానికి కాంగ్రెస్‌తోనే ఎక్కువ ప్రమాదమని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అని గుర్తుచేశారు. దేశంలో 12 ఏళ్లుగా ప్రధాని మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. సీపీఐ పార్టీ ఇప్పటికే జాతీయ హోదా కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ కూడా త్వరలో జాతీయ హోదా కోల్పోబోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీపీఐ సభలో రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. జాతీయ అంశాలపై ఏమాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి కేంద్రంపై విమర్శలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ దేశానికి బీజేపీనే శ్రీరామరక్ష అని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయంటే అందుకు కారణం మోడీనే అని అన్నారు. కేంద్రంపై విమర్శలు చేసేముందు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ఒకసారి రేవంత్ రెడ్డి చూసుకోవాలని రాంచందర్ రావు హితవు పలికారు.

Next Story