- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కుంభకోణాల నుంచి కవితకు మొత్తం తెలుసు: రాంచందర్ రావు
‘సేవ్ తెలంగాణ - ఓట్ ఫర్ బీజేపీ’ అనే నినాదంతో ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘సేవ్ తెలంగాణ - ఓట్ ఫర్ బీజేపీ’ అనే నినాదంతో ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘సేవ్ తెలంగాణ’ పేరుతో పాటను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధనిక తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిందని అన్నారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో కవితను అడిగితే తెలుస్తుంది.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమాల గురించి మంత్రులను అడిగితే తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రెండే అని విమర్శించారు. ప్రజల ధనాన్ని పాలకులు దోచుకు తింటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపై రూ.3600 కోట్ల అప్పు ఉందని అన్నారు.
రూ.80 వేల కోట్ల అప్పు
దీనికి తోడు తెలంగాణలో ట్యాక్స్ టెర్రరిజం రాజ్యమేలుతోందని అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి.. డొక్కు బస్సులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగా మూడేళ్లు కూడా కాలేదు.. అప్పుడే రూ.80 వేల కోట్ల అప్పు చేశారని అన్నారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు అమ్మడం, అప్పులు చేయడం ఈ రెండే కాంగ్రెస్‌కు తెలిసిన విషయాలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కలిసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని ఆరోపించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని.. అవినీతి, దోపిడీ ప్రభుత్వమని విమర్శించారు. వీధి దీపాలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. ఏపీలో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి.. తెలంగాణలో ఎందుకు లేవని అడిగారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు దోచుకోవడం మీద తప్ప.. అభివృద్ధి మీద ధ్యాస లేకుంటే అని అన్నారు.
అధికారంలోకి ఉన్న కాంగ్రెస్‌కేమో తెలంగాణ బంగారు బాతు అయింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడే నుంచి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీతోనే సాధ్యం. బీజేపీకి ఓటేస్తేనే తెలంగాణ మళ్లీ బంగారు తెలంగాణగా మారుతుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.






