చెర్రీ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన 'ఆచార్య' టీం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్

by Dishafeatures2 |
చెర్రీ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన ఆచార్య టీం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా : మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 37వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజైన మూడోరోజే తన బర్త్‌డే కావడంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఇక అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ చెర్రీకి బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది 'ఆచార్య' చిత్ర బృందం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మెయిన్ లీడ్‌గా నటిస్తున్న 'ఆచార్య' మూవీ నుంచి చెర్రీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో చరణ్ 'సిద్ధ' అనే పవర్‌ఫుల్ రోల్ చేస్తుండగా.. ఈ లుక్‌లో సిన్సియర్ బాయ్‌గా కనిపించాడు. ఫ్లూట్‌పై శ్రద్ధగా డిజైన్ వేస్తూ క్లాస్ అప్పీల్‌తో అభిమానులను అట్రాక్ట్ చేస్తున్నాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.



Next Story

Most Viewed