Ram Charan : కళ్లజోడు పెట్టుకుని, ఫుల్ గడ్డంతో మాస్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఫ్యాన్స్‌కు కిక్కుస్తోన్న పిక్స్ వైరల్

by Kodari Anjali |

నిన్న(అక్టోబరు 28) మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు.

Ram Charan : కళ్లజోడు పెట్టుకుని, ఫుల్ గడ్డంతో మాస్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఫ్యాన్స్‌కు కిక్కుస్తోన్న పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న(అక్టోబరు 28) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఏఎన్నార్ నేషనల్ అవార్డు(ANR National Award) సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో సినీ సెలబ్రిటీస్ హాజరవ్వగా.. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ (Ram Charan) లుక్ ఈవెంట్ లో హైలెట్‌గా నిలిచింది. చరణ్ కళ్లజోడు పెట్టుకుని, ఫుల్ గడ్డంతో మాస్ లుక్ మెగా ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అభిమానులు చరణ్ న్యూ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు రామ్ చరణ్ RC16 లుక్ అదిరిందిగా.. బుచ్చిబాబు భారీ ప్లానే చేస్తున్నట్లున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఇక RC16 చిత్రం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. మూడు పాటలు కూడా పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే చిత్ర షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) చిత్రం సంక్రాంతి బరిలోవచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత దిల్‌రాజు(Producer Dil Raju) ఓ పోస్టర్‌ను విడుదల చేసి అధికారికంగా తెలియజేసిన విషయం తెలిసిందే.

Next Story