బండితో Rajagopal Reddy భేటీ వేళ కాంగ్రెస్ అలర్ట్.. ఢిల్లీలో అత్యవసర భేటీ

by Sathputhe Rajesh |   (  Updated:2022-07-27 13:20:46  IST  )

Rajagopal Reddy will meet Bandi Sanjay| తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. కాసేపట్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు బండి సంజయ్

Rajagopal Reddy will meet Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: Rajagopal Reddy will meet Bandi Sanjay| తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. కాసేపట్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు బండి సంజయ్ కు రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేశారు. ఇవాళ వచ్చి కలుస్తానని బండికి సమాచారం ఇచ్చారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జంపింగ్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ క్యాడర్‌లో నిస్తేజం... నాన్చుడు ఎక్కువైందంటా...

Next Story