Pawan Kalyan : రాజ్‌కపూర్‌ సేవలు అపారమైనవి : పవన్ కళ్యాణ్

by Muthe.Rajitha |   (  Updated:2024-12-14 14:30:52  IST  )

భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(DadaSaheb Falke Award), పద్మభూషణ్(Padma Bhushan) గ్రహీత రాజ్‌కపూర్‌(Raj Kapoor) చేసిన సేవలు అపారమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.

Pawan Kalyan : రాజ్‌కపూర్‌ సేవలు అపారమైనవి : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(DadaSaheb Falke Award), పద్మభూషణ్(Padma Bhushan) గ్రహీత రాజ్‌కపూర్‌(Raj Kapoor) చేసిన సేవలు అపారమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. రాజ్‌కపూర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పవన్‌కల్యాణ్ ఎక్స్ వేదిక ద్వారా నివాళి అర్పించారు. రాజ్‌కపూర్‌ భారతీయ సినిమాకు అందించిన అపారమైన సేవలకు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తన అసాధారణమైన నటనతో హిందీ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించారని తెలిపారు. మూడు జాతీయ అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందారని, అతని టైమ్‌లెస్ క్లాసిక్ ‘ఆవారా’ మూవీ (Awara Movie ) నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉందని తెలిపారు. కపూర్ కుటుంబం రాజ్‌కపూర్ వారసత్వాన్ని నిలబెట్టిందని కొనియాడారు.

Next Story