తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. మూడు రోజులపాటు వర్షాలు

by Malleboina Mahesh |

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు స్వల్ప విరామం! రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. మూడు రోజులపాటు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ (Department of Meteorology) ఉపశమనం కలిగించే వార్తను అందించింది. రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన జల్లులు పడతాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, సోమవారం నాటికి వీటి ప్రభావం మరికొన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత చల్లబడినప్పటికీ, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని, ఉక్కపోత, వేడి వాతావరణం యథావిధిగా కొనసాగుతుందని వెదర్ రిపోర్ట్ స్పష్టం చేసింది.

Next Story