Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!

by Kodari Anjali |   (  Updated:2025-01-16 04:53:28  IST  )

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ రానున్న మూడ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతాయని తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు వర్షాలు రానున్నాయి. చలి తీవ్రత కూడా కొనసాగననుందని పేర్కొంది. ఇక తెలంగాణలో వర్షాలు లేనప్పటికీ గంటకు పదిహేను మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని.. కాగా జర్నీ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story