ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. ఎన్నికల ఓటమిపై రాహుల్ గాంధీ

by Disha Web Desk 17 |
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. ఎన్నికల ఓటమిపై రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చాయి. మొన్నటివరకు అధికారంలో ఉన్న పంజాబ్‌ను కూడా చేజార్చుకున్న కాంగ్రెస్.. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో రెండో స్థానానికి పరిమితం కాగా యూపీలో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ' ప్రజల తీర్పును శిరసా వహిస్తాం. ఎన్నికల్లో గెలిచిన పార్టీలకు అభినందనలు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, వాలంటీర్లకు నా కృతజ్ఞతలు.ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజల అభిమతానికి అనుగుణంగా నడుచుకునేందుకు పని చేస్తాం.' అని రాహుల్ గాంధీ వెల్లడించారు.


Next Story