- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. 'Radhe Shyam' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' ప్రేక్షకులను కట్టిపడేసింది. స్వీట్ లవ్ స్టోరీ.. Latest Telugu News..

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' ప్రేక్షకులను కట్టిపడేసింది. స్వీట్ లవ్ స్టోరీ, హాట్ విజువల్స్‌తో అందరినీ కట్టి పడేసింది. ఈ సినిమా విడుదల రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే కలెక్షన్లు సాధించినా ఓవరాల్‌గా మాత్రం సూపర్ టాక్ అందుకుంది. అయితే తాజాగా 'రాధేశ్యామ్' ఓటీటీ రిలీజ్ నెట్టింట హాట్ టాపిక్‌గా ఉంది. ఈ క్రమంలో అనేక తేదీలు వినిపిస్తున్నాయి. కానీ ఏప్రిల్ 1న 'రాధేశ్యామ్' ఓటీటీలో విడుదల కానుందని మాత్రం బలంగా వినిపిస్తోంది. మేకర్స్ సన్నిహిత వర్గాలు కూడా దీనిని నిజమనే అంటున్నాయి. మరి ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాలంటే ఏప్రిల్ 1 వరకు ఆగాల్సిందే. అయితే ఏప్రిల్ 1కి రెండు రోజులే సమయం ఉండటంతో ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. ఈ సినిమాతో పాటు యంగ్ హీరో శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిందని, 'స్టాండ్ అప్ రాహుల్' కూడా ఏప్రిల్ 1న ఓటీటీలో సందడి చేయనుందట. మరి ఏం జరుగుతుందో చూడాలి.






