టీబీజీకేఎస్‌లో చేరిన పీవీకే-5 ఓవర్‌మెన్స్‌ సూపర్‌వైజర్లు

by Ratna Kumari |

కొత్తగూడెం ఏరియా పీవీకే-5కు చెందిన ఓవర్‌మెన్స్‌ టీబీజీకేఎస్ లో చేరారు. వారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పార్టీ కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు.

టీబీజీకేఎస్‌లో చేరిన పీవీకే-5 ఓవర్‌మెన్స్‌ సూపర్‌వైజర్లు
X

దిశ, కొత్తగూడెం సింగరేణి : కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా పీవీకే-5కు చెందిన ఓవర్‌మెన్స్‌ (సూపర్‌వైజర్లు) తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)లో చేరారు. వారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పార్టీ కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌లో చేరిన గోల్కొండ నవీన్, ఎస్‌కే అలీమ్, సబ్బని వినీత్, వసీమ్, అజీజ్ మాట్లాడుతూ, తమకు ఓవర్‌మెన్స్‌గా ఉద్యోగాలు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలతో పాటు పలు కార్మిక సంక్షేమ చర్యలు అమలయ్యాయని, కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సంయుక్త కార్యదర్శి వసికర్ల కిరణ్, సెంట్రల్ కమిటీ సభ్యులు బోరింగ్ శంకర్, ఈశ్వర్, వెంకటేష్, సూరజ్, అశోక్, రాములు, అన్వర్, వల్లల రాయలింగు, కోటేశ్వరరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story