కరణ్‌ను కాకా పట్టిన పూరి.. 'జనగణమన'లో Janhvi Kapoor

by Disha Web |
కరణ్‌ను కాకా పట్టిన పూరి.. జనగణమనలో Janhvi Kapoor
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో వస్తున్న 'లైగర్' పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదల కాకముందే విజయ్‌తో మరో బిగ్ ప్రాజెక్ట్ 'జనగణమన' మొదలుపెట్టేశాడు పూరి. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్న విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ చిత్రంలో జాన్వీని తీసుకోవాలని పూరి ముందే ఫిక్స్ అయిపోగా.. కరణ్ జోహార్ సాయంతో ఆమెను ఒప్పించినట్లు సమాచారం. స్టోరీ నచ్చడంతో తను కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న ఈ మూవీని చార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా 2023 ఏప్రిల్ 23న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed