రాజు ఎల్లప్పుడూ రాజే.. పునీత్ రాజ్‌కుమార్ 'జేమ్స్' టీజర్‌పై అభినందనల వెల్లువ

by Web Desk |
రాజు ఎల్లప్పుడూ రాజే.. పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ టీజర్‌పై అభినందనల వెల్లువ
X

దిశ, సినిమా: కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా నటించిన చిత్రం 'జేమ్స్'. ఈ చిత్రాన్ని పునీత్ పుట్టిన రోజు మార్చి 17న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. నిన్న టీజర్ విడుదల చేశారు. కాగా ఈ టీజర్‌పై పలువురు సినిమా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. 'మేము 'జేమ్స్' రూపంలో ఒక కళాఖండాన్ని చూడబోతున్నామని అనుకుంటున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సర్‌ని అభిమానించే కోట్లాది మందికి ఈ సినిమా ఎప్పుడు ప్రత్యేకమే. మేము నిన్ను కోల్పోవడం ఎంతో బాధిస్తోంది' అంటూ ప్రభాస్ గుర్తు చేసుకోగా.. 'రాజు ఎల్లప్పుడూ రాజే.. జేమ్స్ టీజర్ అద్భుతంగా ఉంది. అప్పు సర్‌ని మళ్లీ పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు వేయిట్ చేయలేము. మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు' అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రాసుకొచ్చాడు. ఇక మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించగా చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.

https://twitter.com/PrabhasRaju/status/1492361411766341633?s=20&t=cuV9lJY9ao8hpuTGuDNC4g

https://twitter.com/prashanth_neel/status/1492043252085637125?s=20&t=0t3jKY84JfNm0taBqefjUQ



Next Story

Most Viewed