రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌ గాంధీ, ఖర్గేకి మూడో వరుసలో సీటు

by Gantepaka Srikanth |

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది.

రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం.. రాహుల్‌ గాంధీ, ఖర్గేకి మూడో వరుసలో సీటు
X

దిశ, వెబ్‌డెస్క్: 77వ గణతంత్ర దినోత్సవం(Republic Day Celebrations) సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలు, పెద్దలు అంతా ఎంతో ఉత్సాహంగా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ, వైమానిక దళం, నావికాదళం, సాంస్కృతిక శకటాలు, వివిధ ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ కవాతు, వేడుక విజయవంతం అయింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే.. ఈ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. రిపబ్లిక్ వేడుకల్లో ప్రతిపక్ష నేతలను కేంద్రం అవమానించిందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)కి మూడో వరుసలో సీటు కేటాయించడంపై రగడ మొదలైంది. ఇది కచ్చితంగా కావాలని చేసిన ప్రోటోకాల్‌ ఉల్లంఘనే అని కాంగ్రెస్‌ మండిపడుతోంది. జెండా పండుగ రోజున ఉద్దేశపూర్వకంగానే అగౌరవపరిచారన్న సోషల్ మీడియా వేదికగా కేంద్రంపై రెచ్చిపోతున్నారు. కేంద్రమంత్రులకు ఇచ్చే గౌరవం కూడా దేశ ప్రతిపక్ష నేతకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story