ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. లేకుంటే హిందూయేతరులుగా ఇండియా

by Harish |

ఘజియాబాద్: హరిద్వార్ హేట్ స్పీచ్ కేసులో నిందితుడిగా ఉండి..telugu latest news

ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. లేకుంటే హిందూయేతరులుగా ఇండియా
X

ఘజియాబాద్: హరిద్వార్ హేట్ స్పీచ్ కేసులో నిందితుడిగా ఉండి బెయిల్‌పై ఉన్న వివాదాస్పద స్వామి యతి నరసింఘానంద్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. రాబోయే దశాబ్దాలలో దేశంలో హిందువులు మైనారిటీలుగా మారకుండా ఉండాలంటే హిందువులు వీలైనంత ఎక్కువగా పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. 2029 నాటికి ఒక హిందూయేతరుడు భారత ప్రధాని కాగలరని గణాంక సమీకరణలు చెబుతున్నాయి అంటూ ఘజియాబాద్ లోని దాస్నా ఆలయ ప్రధాన పూజారిగా ఉంటున్న యతి నర్సింగానంద్ హిందువులు ఎక్కువమంది పిల్లలను కనాల్సిన అవసరమందని చెప్పారు. రాబోయే 20 ఏళ్లలో ఒక హిందూయేతరుడు దేశ ప్రధాని అయినట్లయితే, భారత దేశం హిందూ విహీన దేశంగా అంటే హిందువుల జనాభా తక్కువగా ఉన్న దేశంగా మారిపోతుందని స్వామి నర్సింగానంద్ చెప్పారు.

ఒక ముస్లిం దేశానికి ప్రధానిగా అయితే కేవలం 20 ఏళ్లలో 50 శాతం మంది హిందువులు మత మార్పిడి బారిన పడతారు కాబట్టి హిందువులు తమ ఉనికి కోసం ఆయుధాలు ధరించాలి అని గత ఆదివారం ఢిల్లీలో జరిగిన హిందూ మహాపంచాయిత్ సభలో నర్సింగానంద్ పేర్కొనడం తెలిసిందే. ముస్లింలపై విద్వేష ప్రసంగానికి గాను ఈయన ఇప్పటికే అరెస్టై బెయిల్‌పై ఉన్నారు.

Next Story