- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పర్యటన: ఘనంగా శౌర్య యాత్ర
గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయంలో జరుగుతున్న 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయం (Somnath Temple)లో జరుగుతున్న 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చారిత్రాత్మక 'శౌర్య యాత్ర'లో ఆయన స్వయంగా పాల్గొని ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించారు. ఈ యాత్రలో పరాక్రమానికి ప్రతీకగా 108 గుర్రాలతో కూడిన భారీ ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
యాత్ర అనంతరం ప్రధాని మోడీ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఓంకార మంత్ర పఠనంలో పాల్గొన్న ప్రధాని, శివతత్వాన్ని ఆవిష్కరిస్తూ 3,000 డ్రోన్‌లతో నిర్వహించిన అద్భుతమైన డ్రోన్ షోను వీక్షించారు. సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, భారతీయ సంస్కృతికి మరియు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ స్వాభిమాన్ పర్వ్‌ను నిర్వహిస్తున్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.






