ఎన్నికల్లో ఘన విజయం..తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

by Disha Web |
ఎన్నికల్లో ఘన విజయం..తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశానికి అధిపతి అయిన తల్లికి మాత్రం కొడుకే.. ఈ వ్యాఖ్యలు శుక్రవారం ప్రధాని మోడీ తన తల్లిని కలిసిన సందర్భంగా చేసిన పనికి సరిగ్గా సూట్ అవుతాయి. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌కు వెళ్లిన విషయం విధితమే. కాగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. గుజరాత్ వెళ్లిన ప్రధాని మోడీ గాంధీనగర్‌లో ఉన్న తన తల్లి హీరాబెన్ నివాసానికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని.. పాదాభివందనం చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, గతంలో కూడా మోడీ చాలాసార్లు ఇలా తల్లికి పాదాభివందనం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కాగా, ఈ ఏడాది చివరన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటి అయి.. నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.


Next Story

Most Viewed