- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఆరు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఆరు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఇటలీ దేశాలను సందర్శించనున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత దౌత్య వ్యూహాలను, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
పర్యటించే దేశాలివే
ప్రధాని పర్యటన మొదట యూఏఈ నుంచి ప్రారంభమవుతుంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన భద్రత, వాణిజ్య ఒప్పందాలపై ఇక్కడ చర్చలు జరగనున్నాయి. అక్కడి నుంచి నార్వే, స్వీడన్ వెళ్లనున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ (Blue Economy)లో సహకారం కోసం ఆయా దేశాల అధిపతులతో సమావేశం కానున్నారు. మరుసటి రోజు నెదర్లాండ్స్, ఇటలీ వెళ్లనున్న మోడీ.. యూరోపియన్ యూనియన్‌తో ఆర్థిక బంధాన్ని దృఢపరచుకోవడంతో పాటు, రక్షణ రంగం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంపై దృష్టి సారించనున్నారు.
ప్రపంచవ్యాప్త పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు నిరంతర చమురు, సహజ వాయువు సరఫరాను నిర్ధారించుకోవడంతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించడం ఈ పర్యటనల ఉద్దేశం అని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే రక్షణ రంగంలో యూరప్ దేశాలతో కలిసి పనిచేయడం, గ్రీన్ ఎనర్జీ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, భారతదేశం తన అంతర్జాతీయ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం వంటివి ఈ పర్యటనల లక్ష్యం అన్నారు.






