- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టులో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన ప్రతిపాదనకు అనుగుణంగా, రాష్ట్రపతి 'సుప్రీంకోర్టు సవరణ ఆర్డినెన్స్, 2026'ను జారీ చేశారు. ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టు మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య (చీఫ్ జస్టిస్‌తో కలిపి) ప్రస్తుతం ఉన్న 34 నుండి 38కి పెరగనుంది. అంటే ప్రధాన న్యాయమూర్తి (CJI) మినహా మిగిలిన జడ్జీల సంఖ్య 33 నుండి 37కి పెరుగుతుంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు 92,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(1) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. అయితే, అత్యవసర ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మొదట ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ ఆర్డినెన్స్‌ను రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి, ఉభయ సభల ఆమోదంతో పూర్తిస్థాయి చట్టంగా మార్చనున్నారు. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచడం 2019 తర్వాత ఇదే మొదటిసారి.






