నిండు గర్భంతో ఉన్న మేకపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఏం చేశారంటే..?

by Shiva |   ( Updated:2022-03-31 13:27:11.0  )
నిండు గర్భంతో ఉన్న మేకపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నిండు గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, బామ్మలు... అసలు ఆడవాళ్లే కాదు మగవాళ్లపైన, మూగజీవాలపైన రేప్ జరుగుతున్న ఘటనలు చాలా సాధారణం అయిపోయాయి. అయితే కేరళలో జరిగిన అత్యాచార ఘటన వార్త చదువుతున్నవారికి ఆవేదనతోపాటు అంతకు పదిరెట్లు ఆగ్రహం తెప్పించక మానదు. నాలుగు నెలల నిండు గర్భంతో ఉన్న మేకపై గ్యాంగ్ రేప్ చేసి హతమార్చడం అందరినీ కలచివేస్తోంది. మరో నెలలో ప్రసవానికి రెడీగా ఉన్న మేకపై అసహజ రీతిలో అత్యాచారం జరిపి దాని చావుకు కారకులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు మేక యజమాని.

వివరాల్లోకి వెళితే... కేరళలోని కన్హన్‌గడ్‌ పట్టణంలో నిండు గర్భిణి అయిన మేకపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి చంపినట్లు హోస్‌దుర్గ్ పోలీసులు చెబుతున్నారు. కొత్తచ్చేరి లోని ఎలైట్ హోటల్‌ యజమాని మరణించిన మేకతోపాటు మరికొన్ని పెంపుడు జంతువులను అదే హోటల్ వద్ద పెంచుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల హోటల్ వెనుక అరుపులు వినిపించడంతో హోటల్ యజమాని, సిబ్బంది వెళ్లి చూశారు. వారు రావడాన్ని గమనించిన ముగ్గురు నిందితులు మేకని వదిలేసి పరారవడానికి ప్రయత్నించారు. వారిలో ఒకరిని పట్టుకోగా మిగిలిన ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు. కానీ అప్పటికే మేక ప్రాణాలు విడిచింది. కాగా యజమాని చేతికి చిక్కిన నిందితుడు అదే హోటల్ లో పని చేసేవాడు కావడం గమనార్హం.

యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న హోస్‌దుర్గ్ పోలీసులు నిందితుడు సెంథిల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేకని పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ హాస్పిటల్ కి తరలించారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మేకపై అసహజ రీతిలో లైంగికదాడి జరిగిందని పేర్కొన్నారు. మృతికిగల కారణాలు పూర్తి నివేదికలో ఇవ్వనున్నట్టు తెలిపారు. మేకపై దారుణానికి ఒడిగట్టిన ముగ్గురిపై జంతు హింస నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద, IPC సెక్షన్ 377 ప్రకారం అసహజ నేరాల కింద వారిపై అభియోగాలు మోపినట్టు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. నేరం రుజువైతే జీవితకాలం లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.




Next Story